అన్నమయ్య జిల్లాలో జరగనున్న మదనపల్లె, పుంగనూరు మున్సిపల్ ఎన్నికలను ప్రశాంతంగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు పోలీసు యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఆదేశించారు. మదనపల్లెలో 48 వార్డులకు, పుంగనూరులో 4 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి.
మదనపల్లెలోని జెడ్పీ హైస్కూల్లో శనివారం నిర్వహించిన సమావేశంలో ఎస్పీ ధీరజ్ కునుబిల్లి అధికారులకు, సిబ్బందికి ఎన్నికల బందోబస్తుపై దిశానిర్దేశం చేశారు. ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఆయన పలు సూచనలు చేశారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
పోలింగ్ కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రత
పోలింగ్ కేంద్రాల్లోకి మొబైల్ ఫోన్లు, పెన్నులు, ఇతర నిషేధిత వస్తువులను అనుమతించబోమని ఎస్పీ స్పష్టం చేశారు. పోలింగ్ కేంద్రాలకు 100 మీటర్ల పరిధిలో ప్రజలు గుమిగూడకుండా పటిష్ట బందోబస్తు నిర్వహించాలని ఆదేశించారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ఓటర్ల సౌకర్యార్థం ప్రత్యేక ఏర్పాట్లు
వృద్ధులు, మహిళలు, దివ్యాంగుల కోసం ప్రత్యేక క్యూలైన్లను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ఓటర్లతో పోలీసు సిబ్బంది మర్యాదపూర్వకంగా , వారిని గౌరవించాలని సూచించారు. ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత పాటించాలని తెలిపారు.





