కడప నగరంలో స్థానిక సంస్థల ఎన్నికల సన్నద్ధతపై వైఎస్సార్సీపీ నాయకులు కీలక సమావేశం నిర్వహించారు. మాజీ ఉప ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ భేటీలో పార్టీ బలోపేతం, ఎన్నికల కార్యాచరణపై చర్చించారు.
కడప: స్థానిక సంస్థల ఎన్నికల సన్నద్ధతపై వైఎస్సార్సీపీ నాయకులు కడప నగరంలోని మాజీ ఉప ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో సమావేశమయ్యారు. మాజీ కార్పొరేటర్లు, మాజీ కోఆప్షన్ సభ్యులు, డివిజన్ ఇన్చార్జులు, స్థానిక నాయకులతో ఈ భేటీ నిర్వహించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ఈ సమావేశంలో ఎస్.బి. అంజాద్ బాషా, సీఈసీ సభ్యులు కే. సురేష్ బాబు, మాజీ మేయర్ పాకా సురేష్, రాష్ట్ర యువజన విభాగ కార్యదర్శి షేక్ ఉమైర్ పాల్గొని ఎన్నికల కార్యాచరణపై చర్చించారు.
పార్టీ బలోపేతంపై సూచనలు
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ప్రతి డివిజన్లో నాయకులు, కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగాలని, స్థానిక సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుని ప్రజల తరఫున బలంగా నిలబడాలని నిర్ణయించారు. పార్టీ బలోపేతం, ఎన్నికల సన్నద్ధతపై కీలక సూచనలు చేశారు.
ఈ కార్యక్రమంలో జోన్ అధ్యక్షులు పెద్దిరెడ్డి రామ్మోహన్ రెడ్డి, బీహెచ్ ఇలియాజ్, ఐస్ క్రీమ్ రవి, నాగమల్లారెడ్డితో పాటు మాజీ కార్పొరేటర్లు, కోఆప్షన్ సభ్యులు, డివిజన్ ఇన్చార్జులు తదితరులు పాల్గొన్నారు.

