రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో కడప జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసు శాఖ ప్రత్యేక చర్యలు చేపట్టింది. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు సున్నిత గ్రామాల్లో పల్లె నిద్ర కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా మండలం సింగరాయపల్లిలో ఎస్ఐ హన్మంతు ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం జరిగింది.
జిల్లా ఎస్పీ శ్రీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఐపీఎస్ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా సున్నిత గ్రామాల్లో పల్లె నిద్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా బద్వేల్ సబ్ డివిజన్ పరిధిలోని మండలం సున్నిత గ్రామమైన సింగరాయపల్లిలో ఎస్ఐ హన్మంతు ఆధ్వర్యంలో పల్లె నిద్ర కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్థానిక పోలీసు సిబ్బంది హాజరయ్యారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
గ్రామస్తులతో ఎస్ఐ ముఖాముఖి
ఈ సందర్భంగా ఎస్ఐ హన్మంతు గ్రామస్తులతో ముఖాముఖి మాట్లాడారు. గ్రామంలో ఉన్న ప్రధాన సమస్యలు, వర్గ విభేదాలు, పాత కక్షలు, ఎన్నికల సమయంలో జరిగే గొడవలపై ఆరా తీశారు. ప్రజలు నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకోవాలని, ఎవరైనా బెదిరింపులకు గురిచేస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి







