వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దంపతులు చెన్నైలో జరిగిన వివాహ వేడుకకు హాజరయ్యారు. చెన్నైలోని లీలా ప్యాలెస్ హోటల్లో జరిగిన వైఎస్ అనిల్ రెడ్డి కుమార్తె శ్రేయ వివాహ వేడుకలో జగన్, ఆయన సతీమణి వైఎస్ భారతి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నూతన వధూవరులు శ్రేయ - ఉజ్వల్ లను జగన్ దంపతులు ఆశీర్వదించారు. నూతన దంపతులకు హృదయపూర్వక వివాహ శుభాకాంక్షలు తెలిపారు. వారు సుఖ సంతోషాలతో, ఆనందమయమైన దాంపత్య జీవితాన్ని గడపాలని ఆకాంక్షించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ప్రముఖుల హాజరు
ఈ వివాహ వేడుకకు తెలుగు, తమిళ రాష్ట్రాలకు చెందిన పలువురు ప్రముఖులు హాజరై సందడి చేశారు. తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్, ప్రముఖ పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, వైఎస్ విజయమ్మతో పాటు పలువురు రాజకీయ, వ్యాపార రంగ ప్రముఖులు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
వేడుకలో జగన్ దంపతులు కుటుంబ సభ్యులతో కలిసి సరదాగా గడిపారు. వధూవరులతో కలిసి ఫోటోలు దిగారు. అతిథులతో మాట్లాడుతూ వివాహ వేడుకలో ఆనందంగా పాల్గొన్నారు.

