అమెరికా, జపాన్ కేంద్ర బ్యాంకులు వడ్డీ రేట్లను పెంచినప్పటికీ దక్షిణ కొరియా స్టాక్ మార్కెట్లో భారీ ర్యాలీ నమోదైంది. కొస్పి సూచీ 2.66 శాతం లాభపడి 6,894.23 వద్ద ముగిసింది. ఒక దశలో 6,900 మార్కును కూడా దాటింది. దీంతో 7,000 స్థాయికి సూచీ మరింత చేరువైంది.
ఈ ర్యాలీకి ప్రధానంగా సెమీకండక్టర్ షేర్లు మద్దతుగా నిలిచాయి. శాంసంగ్ ఎలక్ట్రానిక్స్ షేరు 3.73 శాతం పెరగగా.. ఎస్కే హైనిక్స్ షేరు 6.42 శాతం లాభపడింది. వచ్చే ఏడాది చిప్ విక్రయాలు ఈ ఏడాదితో పోలిస్తే రెట్టింపు కావచ్చన్న అంచనాలు సెమీకండక్టర్ రంగంపై పెట్టుబడిదారుల విశ్వాసాన్ని పెంచాయి.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
అమెరికా ఫెడరల్ రిజర్వ్ కీలక వడ్డీ రేటును 25 బేసిస్ పాయింట్లు పెంచి 3.754.00 శాతానికి చేర్చింది. అనంతరం జపాన్ బ్యాంక్ కూడా తన పాలసీ రేటును 1.00 శాతం నుంచి 1.25 శాతానికి పెంచింది. అయినప్పటికీ మార్కెట్లలో తీవ్ర ఒత్తిడి కనిపించకుండా రిస్క్ ఆస్తులపై కొనుగోళ్లు కొనసాగాయి.
జపాన్ వడ్డీ రేటు పెంపు మార్కెట్ అంచనాల కంటే దూకుడుగా ఉండకపోవడంతో యెన్-క్యారీ ట్రేడ్లపై ఉన్న ఆందోళనలు కొంత తగ్గాయి. ఇదే సమయంలో చమురు ధరలు కొంత తగ్గడం, అమెరికా 10 ఏళ్ల ట్రెజరీ బాండ్ రాబడి 4.93 శాతం ప్రాంతానికి దిగిరావడం కూడా మార్కెట్ సెంటిమెంట్‌కు మద్దతుగా నిలిచాయి.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి

