ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా చోటుచేసుకుంటున్నాయని ఆరోపణలు ఎదుర్కొంటున్న దౌర్జన్యాలు, నామినేషన్ ప్రక్రియలో అంతరాయాలు, ప్రతిపక్ష అభ్యర్థులపై దాడుల అంశాలపై హైదరాబాద్‌లోని ప్రెస్ క్లబ్లో రౌండ్‌టేబుల్ సమావేశం జరిగింది. ఎన్నికల్లో పోటీ చేసే హక్కును కాపాడాలని, ప్రజాస్వామ్య విలువలను పరిరక్షించాలని సమావేశంలో పాల్గొన్న పలువురు జర్నలిస్టులు, సామాజిక కార్యకర్తలు, ఇతర ప్రముఖులు అభిప్రాయపడ్డారు.
ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్, మండల పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గాల (ఎంపీటీసీ), జిల్లా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గాల (జెడ్పీటీసీ) ఎన్నికల సందర్భంగా చోటుచేసుకుంటున్నాయని ఆరోపణలు ఎదుర్కొంటున్న దౌర్జన్యాలు, నామినేషన్ ప్రక్రియలో అంతరాయాలు, ప్రతిపక్ష అభ్యర్థులపై దాడుల అంశాలపై హైదరాబాద్‌లోని ప్రెస్ క్లబ్లో రౌండ్‌టేబుల్ సమావేశం జరిగింది. ఎన్నికల్లో పోటీ చేసే హక్కును కాపాడాలని, ప్రజాస్వామ్య విలువలను పరిరక్షించాలని సమావేశంలో పాల్గొన్న పలువురు జర్నలిస్టులు, సామాజిక కార్యకర్తలు, ఇతర ప్రముఖులు అభిప్రాయపడ్డారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్, మండల పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గాల (ఎంపీటీసీ), జిల్లా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గాల (జెడ్పీటీసీ) ఎన్నికలకు సంబంధించిన ప్రక్రియలో నామినేషన్ పత్రాలను లాక్కోవడం, అభ్యర్థులను అడ్డుకోవడం, వారిని తరిమికొట్టడం వంటి ఘటనలు చోటుచేసుకున్నాయని సమావేశంలో వక్తలు ఆరోపించారు. ఇలాంటి పరిణామాలు స్వేచ్ఛాయుత ఎన్నికల నిర్వహణపై ఆందోళన కలిగిస్తున్నాయని పేర్కొన్నారు.
ప్రజాస్వామ్య హక్కులకు భంగం కలగకూడదు
ఎన్నికల్లో ప్రతి అభ్యర్థికి స్వేచ్ఛగా నామినేషన్ దాఖలు చేసే అవకాశం ఉండాలని, ఓటర్లు తమకు నచ్చిన అభ్యర్థిని ఎంచుకునే పరిస్థితులు ఉండాలని వక్తలు అన్నారు. రాజకీయ ప్రత్యర్థులను భయపెట్టడం, నామినేషన్లను అడ్డుకోవడం వంటి చర్యలు ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని అభిప్రాయపడ్డారు. ఎన్నికల సమయంలో చట్టాన్ని అమలు చేయాల్సిన యంత్రాంగం నిష్పక్షపాతంగా వ్యవహరించాలని, అధికార పార్టీతో సంబంధం లేకుండా అన్ని పార్టీల అభ్యర్థులకు సమాన రక్షణ కల్పించాలని కోరారు.

