దక్షిణాఫ్రికా పర్యటనకు ముందు బంగ్లాదేశ్ క్రికెట్ జట్టుకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు స్టార్ ఓపెనర్ షాద్మన్ ఇస్లాం చీలమండ గాయం కారణంగా దక్షిణాఫ్రికా పర్యటనకు దూరమయ్యాడు. వెస్టిండీస్‌తో జరుగుతున్న టెస్టు మ్యాచ్‌లో ఫీల్డింగ్ చేస్తుండగా ఈ గాయం అయింది.
ప్రస్తుతం వెస్టిండీస్‌తో సిల్హెట్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో ఫీల్డింగ్ చేస్తుండగా షాద్మన్ ఎడమ చీలమండకు గాయమైంది. అమీర్ జాంగూ కొట్టిన బంతిని ఆపేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో అతడి కాలు జారి చీలమండలో మెలికపడింది. నొప్పి తీవ్రంగా ఉండటంతో మైదానంలోనే కుప్పకూలిపోయాడు. దీంతో సహాయక సిబ్బంది స్ట్రెచర్‌పై అతడిని మైదానం వెలుపలకు తీసుకెళ్లారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి తరలించి ఎంఆర్ఐ స్కాన్ కూడా నిర్వహించారు. షాద్మన్ చీలమండకు కేవలం మెలిక మాత్రమే కాకుండా కండరాల చీలిక () లేదా ఎముక విరిగే అవకాశం కూడా ఉందని బంగ్లాదేశ్ సెలక్షన్ కమిటీ సభ్యుడు వెల్లడించినట్లు సమాచారం.
గాయం తీవ్రత
ఈ గాయం తీవ్రత దృష్ట్యా, దక్షిణాఫ్రికాతో జరగనున్న రెండు టెస్టుల సిరీస్‌కు అతడు అందుబాటులో ఉండడని స్పష్టం చేశారు. ఇది బంగ్లాదేశ్ జట్టుకు పెద్ద లోటుగా పరిగణించబడుతోంది.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
