విజయవాడలో జరుగుతున్న ఏపీ శాసనసభ, మండలి సభ్యుల క్రీడా పోటీల సందర్భంగా జరిగిన క్రికెట్ మ్యాచ్‌లో డిప్యూటీ స్పీకర్ మరియు ఉండి ఎమ్మెల్యే రఘురామ కృష్ణం రాజు గాయపడ్డారు. ఆయన భుజం మరియు మణికట్టుకు బలమైన గాయాలయ్యాయి.
ఏపీ శాసనసభ్యుల క్రీడా పోటీలలో భాగంగా ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో జరిగిన క్రికెట్ మ్యాచ్‌లో ఈ సంఘటన చోటు చేసుకుంది. బ్యాటింగ్ చేస్తున్న సమయంలో రఘురామ కృష్ణం రాజు ఒక పరుగు తీసేందుకు ప్రయత్నిస్తూ క్రీజులోకి డైవ్ చేశారు. ఈ క్రమంలో ఆయన నియంత్రణ కోల్పోయి నేలపై పడిపోయారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
నేరుగా కుడి భుజంపై పడటంతో ఆయన భుజం మరియు మణికట్టుకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే వైద్య బృందం ప్రాథమిక చికిత్స అందించగా, అనంతరం ఆయనను మణిపాల్ ఆసుపత్రికి తరలించారు. వైద్యుల ప్రాథమిక నిర్ధారణ ప్రకారం, భుజం ఎముక విరిగిందని, మణికట్టు వద్ద గాయమైందని తెలిసింది.









