కామారెడ్డి జిల్లాలో గణేష్ నిమజ్జన కార్యక్రమాలను ప్రశాంతంగా, సురక్షితంగా నిర్వహించేందుకు చేపట్టిన జిల్లా ఎస్పీ ఎం. రాజేష్ చంద్ర, ఐపీఎస్ బుధవారం పరిశీలించారు. పట్టణంలోని పలు గణేష్ మండపాలను సందర్శించి, నిర్వాహకులతో మాట్లాడి భద్రతా ఏర్పాట్లపై ఆరా తీశారు.
జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర బుధవారం కామారెడ్డి పట్టణంలోని కల్కి గణేష్ మండలి, ఏకదంత గణేష్ మండలి, శివసేన గణేష్ మండలి, పాన్ చౌరస్తాలోని బాల గణేష్ మండపాలను సందర్శించారు. అక్కడ భద్రతా ఏర్పాట్లు, భక్తుల రద్దీ, నిమజ్జన ఊరేగింపు నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. ఊరేగింపు సమయంలో భక్తులు, నిర్వాహకులు అప్రమత్తంగా ఉండాలని, పోలీసుల సూచనలు పాటిస్తూ ప్రశాంతంగా నిమజ్జనం నిర్వహించుకోవాలని సూచించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
చిన్నారులతో ముచ్చట్లు, టెక్రియాల్ చెరువు పరిశీలన
మండపాల వద్ద చిన్నారులతో ఎస్పీ ఆప్యాయంగా మాట్లాడి, వారితో ఫొటోలు, సెల్ఫీలు దిగారు. అనంతరం దేవునిపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలోని టెక్రియాల్ చెరువు నిమజ్జన ప్రాంతాన్ని కూడా పరిశీలించారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా, ట్రాఫిక్‌కు అంతరాయం లేకుండా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి

