పట్టణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి అన్నారు. హైబ్రిడ్ యాన్యూటీ మోడల్ లో భాగంగా పులివెందులలో రూ.20 కోట్ల అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు.
రాష్ట్రవ్యాప్తంగా 121 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో రూ.11,360 కోట్లతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంగళవారం కుప్పం నుంచి వర్చువల్ గా శంకుస్థాపన చేశారు. ఈ నేపథ్యంలో పులివెందుల మున్సిపల్ టౌన్ హాల్ లో జరిగిన కార్యక్రమంలో కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి రూ.20 కోట్ల పనులకు శంకుస్థాపన చేశారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ఈ నిధులతో తాగునీరు, డ్రైనేజీ, రోడ్లు, లైటింగ్ పనులు చేపడతామని కలెక్టర్ తెలిపారు. జిల్లాలోని 9 పురపాలక సంఘాల్లో గత ఆరు నెలల్లో రూ.1500 కోట్ల పనులు చేపట్టామని చెప్పారు. పులివెందులలో అదనంగా పట్టణ అభివృద్ధి నిధులు రూ.40 కోట్లు, 15వ ఆర్థిక సంఘం నిధులు రూ.11.9 కోట్లతో పనులు జరుగుతున్నాయని పేర్కొన్నారు.












