కామారెడ్డి, 2026-07-31
తనకు ఇల్లు లేదని, బైపాస్ పక్కన ఉన్న చిన్న గుడిసెలోనే వంట చేసుకుని, పడుకుంటున్నానని, ఇందిరమ్మ ఇంటి పథకం కింద ఇల్లు మంజూరు చేయాలని కామారెడ్డి పట్టణానికి చెందిన అన్నేపల్లి రాజు ఆవేదన వ్యక్తం చేశారు. తనకు స్థలం ఉన్నప్పటికీ, మొదటి విడతలో ఇల్లు మంజూరు కాలేదని, రెండో విడతలోనైనా అనుమతి ఇవ్వాలని ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబ్బీర్ ఆలీని ఆయన కోరారు.
తనకు ఇందిరమ్మ ఇల్లు కట్టించుకోవడానికి స్థలం ఉన్నప్పటికీ, ప్రభుత్వ సలహాదారు ఇందిరమ్మ ఇంటి పథకం కోసం దరఖాస్తు చేసుకున్నానని, మొదటి విడతలో ఇల్లు మంజూరు అవుతుందని అధికారులు చెప్పినా రాలేదని కామారెడ్డి పట్టణం ఎస్సీ వాడ, అన్నేపల్లి రాజు పేర్కొన్నారు. తన దళితవాడకు చెందిన తనకు ఉండటానికి ఇల్లు లేదని, బైపాస్ పక్కన ఉన్న చిన్న గుడిసెలోనే వంట చేసుకుని, పడుకుంటున్నానని తెలిపారు. ఇప్పటికైనా జిల్లా అధికారులు తనకు ఇందిరమ్మ ఇల్లు నిర్మించుకోవడానికి అనుమతి ఇచ్చి ఆదుకోవాలని ఆయన ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబ్బీర్ ఆలీని వేడుకున్నారు.
తాను ఇదే గుడిసెలో వంట చేసుకుని తిని, ఇక్కడే పడుకుంటున్నానని, అధికారులు తనపై దయవుంచి ఇందిరమ్మ పథకం కింద ఇల్లు మంజూరు చేయాలని అధికారులను, జిల్లా కలెక్టర్ గారిని కోరుతున్నట్లు అన్నేపల్లి రాజు తెలిపారు. కనీసం రెండో విడతలోనైనా ఇందిరమ్మ ఇల్లు నిర్మించుకోవడానికి పర్మిషన్ ఇప్పించాలని ఆయన ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబ్బీర్ ఆలీని అభ్యర్థించారు.












