మైదుకూరు మున్సిపాలిటీలో అభివృద్ధి పనులను నిర్దేశిత గడువులోగా పూర్తి జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ ఛాంబర్లో జరిగిన సమీక్షా సమావేశంలో తాగునీరు, రహదారులు, డ్రైనేజీ, పారిశుద్ధ్యం, వీధి దీపాల వంటి అంశాలపై ఆయన ప్రత్యేక దృష్టి సారించారు.
మైదుకూరు మున్సిపాలిటీ అభివృద్ధిపై కలెక్టర్ శ్రీధర్ అధ్యక్షతన శుక్రవారం సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్, మున్సిపల్ కమిషనర్ రంగస్వామి, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. అభివృద్ధి పనులను నిర్దేశిత గడువులోగా పూర్తి కలెక్టర్ అధికారులను ఆదేశించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
తాగునీటి సరఫరా, రహదారులు, డ్రైనేజీ వ్యవస్థలు, పారిశుద్ధ్యం, వీధి దీపాల నిర్వహణపై కలెక్టర్ ప్రత్యేకంగా సమీక్షించారు. ప్రస్తుతం మైదుకూరులో బోరుబావుల ద్వారా 3.65 మిలియన్ లీటర్ల నీరు సరఫరా అవుతోందని, భవిష్యత్ అవసరాలకు శాశ్వత నీటి వనరులు అవసరమని అధికారులు వివరించారు. అమృత్ 2.0 పథకం కింద చేపడుతున్న పైప్‌లైన్, నీటి ట్యాంకులు, శుద్ధి కేంద్రం పనులను వేగవంతం కలెక్టర్ ఆదేశించారు.












