జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక () కార్యక్రమం నిర్వహించబడింది. జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు ఆదేశాల మేరకు జరిగిన ఈ కార్యక్రమంలో మొత్తం 60 ఫిర్యాదులను అధికారులు స్వీకరించారు. బాధితులకు సత్వర, పారదర్శక న్యాయం అందించడమే లక్ష్యమని ఎస్పీ తెలిపారు.
జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక () కార్యక్రమం నిర్వహించబడింది. జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు, ఐపీఎస్ ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో జిల్లా నలుమూలల నుంచి వచ్చిన బాధితుల నుండి మొత్తం 60 ఫిర్యాదులను అధికారులు స్వీకరించారు. ఈ సందర్భంగా అడిషనల్ ఎస్పీలు ఏ. శ్రీనివాసులు (పరిపాలన), శ్రీమతి శ్రీలత (మహిళా పోలీస్ స్టేషన్) స్వయంగా అర్జీదారులతో మాట్లాడి, వారి సమస్యలను అడిగి తెలుసుకుని నమోదు చేసుకున్నారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
బాధితులకు సత్వర, పారదర్శక న్యాయం అందించడమే పోలీస్ శాఖ ప్రధాన లక్ష్యమని జిల్లా ఎస్పీ తెలిపారు. ఈ సందర్భంగా ఎస్పీ అధికారులు మరియు సిబ్బందికి పలు సూచనలు చేశారు. అందిన ప్రతి ఫిర్యాదును చట్టపరిధిలో నిష్పాక్షికంగా, వేగవంతంగా విచారించి నిర్ణీత గడువులోపు పరిష్కరించాలని సూచించారు.






