గ్రామీణ స్థానిక సంస్థల ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బందికి రెమ్యునరేషన్, ఆహార అలవెన్సులను పెంచుతూ పంచాయతీ రాజ్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు జి.ఓ.ఆర్.టి. నెం.1086, తేదీ 03-11-2026 న ఉత్తర్వులు విడుదలయ్యాయి. పెరిగిన రేట్లతో పాటు భోజన అలవెన్సులో భారీ పెరుగుదల ఉంది.
పంచాయతీ రాజ్ శాఖ విడుదల చేసిన ఉత్తర్వుల ప్రకారం, ప్రిసైడింగ్ ఆఫీసర్, కౌంటింగ్ సూపర్ వైజర్లకు రోజుకు 500 రూపాయలు లేదా 2,000 రూపాయలు లంప్ సమ్ గా చెల్లించనున్నారు. పోలింగ్ ఆఫీసర్, ఏపీవో, ఓపీవోలకు రోజుకు 400 రూపాయలు లేదా 1,600 రూపాయలు లంప్ సమ్ గా అందజేస్తారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
అలాగే, కౌంటింగ్ అసిస్టెంట్లకు రోజుకు 450 రూపాయలు లేదా 1,350 రూపాయలు లంప్ సమ్, క్లాస్ 4, ఆఫీస్ సబార్డినేట్లకు రోజుకు 350 రూపాయలు లేదా 1,400 రూపాయలు లంప్ సమ్ చెల్లించనున్నారు. మైక్రో అబ్జర్వర్లకు 2,000 రూపాయలు లంప్ సమ్ గా అందజేస్తారు.
అత్యంత ముఖ్యంగా, భోజనం, అల్పాహారం అలవెన్సును గణనీయంగా పెంచారు. గతంలో రోజుకు 150 రూపాయలు మాత్రమే ఉండగా, ఇప్పుడు రోజుకు 500 రూపాయలకు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి





