కామారెడ్డి, 8 November
సొంతింటి కల నెరవేరడంతో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల కుటుంబాల్లో దీపావళి ఆనందాలు వెల్లివిరిశాయి. కామారెడ్డి నియోజకవర్గంలోని తిమ్మాకపల్లి, గార్గుల్ గ్రామాల్లో నూతనంగా నిర్మించుకున్న ఇందిరమ్మ ఇళ్ల వద్ద నిర్వహించిన దీపావళి వేడుకల్లో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ పాల్గొని లబ్ధిదారుల కుటుంబాలతో కలిసి పండుగ సంబరాలు జరుపుకున్నారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
లబ్ధిదారులకు శుభాకాంక్షలు
తిమ్మాకపల్లి గ్రామంలో మొగిలి పద్మ, మొగిలి శ్యామల, మంగలి రాజవ్వ, మంగలి లక్ష్మి, పంగ వనిత కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరయ్యాయి. అలాగే గార్గుల్ గ్రామంలో గడ్డం గౌతమి, కాసార్ల లయ, బొంబోతుల భారత్గౌడ్ కుటుంబ సభ్యులతో కలిసి షబ్బీర్ అలీ దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు. లబ్ధిదారుల దంపతులకు స్వయంగా స్వీట్లు తినిపించి దీపావళి శుభాకాంక్షలు తెలిపారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ప్రభుత్వ లక్ష్యం పేదల సొంతింటి కల సాకారం
ఈ సందర్భంగా షబ్బీర్ అలీ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నాయకత్వంలోని ప్రజాపాలన ప్రభుత్వంలో నిరుపేదల సొంతింటి కల సాకారమవుతోందని అన్నారు. కొత్త ఇళ్లలో పండుగ వెలుగులు నిండటం ఎంతో ఆనందంగా ఉందని, అర్హులైన ప్రతి పేద కుటుంబానికి సొంతింటి కలను నెరవేర్చడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు.

