రంగారెడ్డి, 4 నవంబర్ 2026
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకనంలో జరిగినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న అక్రమాల కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దర్యాప్తును వేగవంతం చేసింది. బుధవారం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని మొత్తం ఏడు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది. మాజీ ఐపీఎస్ అధికారి, ఏపీపీఎస్సీ మాజీ కార్యదర్శి పీఎస్ఆర్ ఆంజనేయులు నివాసంలోనూ తనిఖీలు చేపట్టింది.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ఈడీ హైదరాబాద్ జోనల్ కార్యాలయానికి చెందిన బృందాలు హైదరాబాద్, పరిసర ప్రాంతాల్లోని ఆరు ప్రదేశాలతో పాటు గుంటూరు జిల్లాలోని ఒక ప్రాంతంలో సోదాలు నిర్వహించాయి. బంజారాహిల్స్‌లోని క్యామ్‌సైన్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్, ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ పి. మధుసూదనరావుకు సంబంధించిన ప్రాంతాల్లో తనిఖీలు జరిగాయి.
అలాగే రంగారెడ్డి జిల్లా ఖాసింబౌలిలో మాజీ ఐపీఎస్ అధికారి పీఎస్ఆర్ ఆంజనేయులుకు సంబంధించిన నివాసంలోనూ అధికారులు సోదాలు చేశారు. ఈ సందర్భంగా ఆయన వాంగ్మూలాన్ని నమోదు చేసి, కొన్ని ఆస్తుల పత్రాలను పరిశీలించినట్లు సమాచారం.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి

