ఇంటి నుంచే పని చేసే ఉద్యోగులు, ఫ్రీలాన్సర్లు, విద్యార్థుల కోసం సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ () వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. నగరంలోని ఎంపిక చేసిన పార్కుల్లో వై-ఫై, ల్యాప్‌టాప్ ఛార్జింగ్ పాయింట్లు, ప్రత్యేక సీటింగ్ సదుపాయాలతో వర్క్ ఫ్రమ్ పార్క్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని ప్రణాళిక రూపొందించింది. ఈ ఏడాది 300 కొత్త పార్కులను అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.
సైబరాబాద్ పరిధిలో ఈ ఏడాది 300 కొత్త పార్కులను అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. వీటిలో 30 నుంచి 40 పార్కుల్లో ప్రత్యేక వర్క్‌స్పేస్‌లు ఏర్పాటు చేయనున్నారు. సెరిలింగంపల్లి, కూకట్పల్లి, మాదాపూర్ జోన్ల పరిధిలో ఒక ఎకరానికి పైగా విస్తీర్ణం ఉన్న పార్కులను ఈ కార్యక్రమం కోసం గుర్తించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ఈ పార్కుల్లో ఉచిత వై-ఫై, విద్యుత్ ఛార్జింగ్ పాయింట్లు, బెంచీలు, టియర్డ్ సీటింగ్, సీసీటీవీ కెమెరాలు, వాకింగ్ ట్రాక్‌లు, కాఫీ, స్నాక్స్ కియోస్క్‌లు ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. సెరిలింగంపల్లి జోన్‌లోని మాధవ హిల్స్ కాలనీ, మసీద్‌బండలో సుమారు 1.5 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న పార్కును తొలి పైలట్ కేంద్రంగా ఎంపిక చేశారు.
ఇక్కడ దాదాపు 700 చదరపు గజాల స్థలాన్ని వర్క్‌స్పేస్‌గా అభివృద్ధి చేయనున్నారు. మాదాపూర్‌లో మరో కేంద్రం ఏర్పాటుకు కూడా స్థలాన్ని గుర్తించి డిజైన్లు సిద్ధం చేశారు. ఈ రెండు కేంద్రాలను 2027 నూతన సంవత్సరం నాటికి అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!

