ఆదిలాబాద్, 4 నవంబర్ 2026
తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లాకు సాగునీరు అందించేందుకు ప్రతిపాదించిన తుమ్మిడిహెట్టి బ్యారేజీ నిర్మాణంపై మహారాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు కొనసాగించాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి నీటిపారుదల శాఖ అధికారులను ఆదేశించారు. ప్రాజెక్టుకు సంబంధించిన ముంపు ప్రాంతాల వివరాలు, గత ఒప్పందాలు, సాంకేతిక పత్రాలను సిద్ధం చేసి మహారాష్ట్రకు అందించాలని సూచించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
మంగళవారం, జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో నీటిపారుదల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఉన్నతాధికారులతో కలిసి ముఖ్యమంత్రి ఈ ప్రాజెక్టుపై సమీక్ష నిర్వహించారు. మహారాష్ట్రతో ఇటీవల జరిగిన చర్చల వివరాలను తెలుసుకుని, ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లేందుకు అవసరమైన చర్యలపై అధికారులకు సూచనలు చేశారు.
పరిహారం చెల్లింపునకు తెలంగాణ సిద్ధం
బ్యారేజీ నిర్మాణం వల్ల మహారాష్ట్రలో ముంపునకు గురయ్యే భూములకు తగిన పరిహారం చెల్లించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. అవసరమైన మొత్తాన్ని రెండు రాష్ట్రాల ఉమ్మడి ఖాతాలో జమ చేసేందుకు కూడా ప్రభుత్వం సిద్ధమని చెప్పారు. ముంపు విస్తీర్ణాన్ని అంచనా వేసేందుకు మహారాష్ట్ర స్వతంత్రంగా సర్వే నిర్వహించినా అభ్యంతరం లేదని స్పష్టం చేశారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి







