కృత్రిమ మేధ (ఏఐ) సాయంతో సైబర్ నేరగాళ్లు నిర్వహిస్తున్న దాడులు మరింత ప్రమాదకరంగా మారుతున్నాయని భారత కంప్యూటర్ అత్యవసర స్పందన బృందం (-) హెచ్చరించింది. ముఖ్యంగా బ్యాంకులు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు (లు), ఫిన్‌టెక్ సంస్థలు, డిజిటల్ రుణ వేదికలు, పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్లను లక్ష్యంగా చేసుకుని దాడులు జరుగుతున్నట్లు వెల్లడించింది.
తాజాగా విడుదల చేసిన సైబర్ భద్రతా అడ్వైజరీలో ఈ దాడులకు క్రాఫ్టీ ఫాల్కన్ ( ) అనే పేరును గుర్తించినట్లు - పేర్కొంది. ఏఐ ఆధారిత సాధనాలను ఉపయోగిస్తున్న దాడి బృందాలు లక్ష్య సంస్థల సాంకేతిక వ్యవస్థల్లోని బలహీనతలను వేగంగా గుర్తించి, వాటి పేమెంట్, నిధుల బదిలీ వ్యవస్థలను దుర్వినియోగం చేస్తున్నాయని తెలిపింది.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
దాడుల తీరు
సంస్థల ఇంటర్నెట్కు అనుసంధానమైన సర్వర్లు, పరీక్షల కోసం ఏర్పాటు చేసిన సాఫ్ట్వేర్ వ్యవస్థలు, భద్రత సరిగా లేని ఏపీఐలను సైబర్ నేరగాళ్లు ప్రవేశ మార్గాలుగా ఉపయోగిస్తున్నారు. ఒకసారి వ్యవస్థలోకి ప్రవేశించిన తర్వాత పేమెంట్ గేట్వేలు, బ్యాంకు భాగస్వామ్య వ్యవస్థలకు సంబంధించిన కీలక సమాచారాన్ని దొంగిలించి, నిధుల బదిలీ ఏపీఐలను దుర్వినియోగం చేస్తున్నారు.
కొన్ని సందర్భాల్లో ముందుగా ఒక రూపాయి వంటి చిన్న మొత్తాలతో లావాదేవీలను పరీక్షించి, ఆ తర్వాత పెద్ద మొత్తాలను బదిలీ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. గతంలో భద్రతా చర్యలు చేపట్టిన కొన్ని సంస్థలపైనా మళ్లీ దాడులకు ప్రయత్నాలు జరిగినట్లు తెలిసింది.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!

