ఆంధ్రప్రదేశ్‌లో ఆర్నబ్ తుపాను ప్రభావంతో విద్యుత్ వ్యవస్థ తీవ్రంగా దెబ్బతింది. బలమైన గాలులు, భారీ వర్షాల కారణంగా విద్యుత్ స్తంభాలు నేలకూలడం, విద్యుత్ లైన్లు దెబ్బతినడంతో అనేక గ్రామాల్లో సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ముఖ్యంగా తీర ప్రాంత జిల్లాల్లో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
విద్యుత్ సరఫరాను పునరుద్ధరించేందుకు అధికారులు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. తుఫాను కారణంగా ఏపీఈపీడీసీఎల్ పరిధిలోని కాకినాడ, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, పశ్చిమ గోదావరి జిల్లాల్లో విద్యుత్ వ్యవస్థకు భారీ నష్టం వాటిల్లింది. సుమారు 15 వేల విద్యుత్ స్తంభాలు దెబ్బతిన్నట్లు అధికారులు వెల్లడించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
పునరుద్ధరణ పనులు
మొత్తం 3,872 గ్రామాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడగా, వాటిలో 2,549 గ్రామాలకు సరఫరాను పునరుద్ధరించినట్లు తెలిపారు. మిగిలిన గ్రామాల్లోనూ పనులు కొనసాగుతున్నాయి. విద్యుత్ పునరుద్ధరణ కోసం 8,161 మంది సిబ్బందితో 703 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. రాయలసీమ ప్రాంతం నుంచి మరో 2,000 మంది సిబ్బందిని కూడా రప్పించారు.











