ఒడిశాలోని గజపతి జిల్లాపై అర్నబ్ తుఫాను తీవ్ర ప్రభావం చూపింది. బుధవారం నుంచి కురుస్తున్న నిరంతర వర్షాలతో మహేంద్రతనయ నదీ పరివాహక ప్రాంతంలో వరద పరిస్థితులు ఏర్పడ్డాయి. గోషాణి బ్లాక్‌లోని పలు ప్రాంతాల్లోకి వరద నీరు చేరడంతో జనజీవనం స్తంభించింది.
గోషాణి బ్లాక్‌లోని బఘసాలా, భిన్నాలా, బాపూజీ పేట ప్రాంతాల్లోకి వరద నీరు ప్రవేశించడంతో సాధారణ జనజీవనం తీవ్రంగా ప్రభావితమైంది. ఎడతెరిపి లేని వర్షాల కారణంగా నదులు, వాగుల్లో నీటిమట్టాలు పెరిగాయి. వ్యవసాయ పొలాలు నీట మునగడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
కేంద్ర ప్రభుత్వం సహాయక చర్యలు
తుఫాను ప్రభావిత రాష్ట్రాలకు అవసరమైన సహాయం అందిస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా హామీ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్, పుదుచ్చేరి, ఒడిశా, ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రులతో మాట్లాడినట్లు ఆయన తెలిపారు. జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం (), రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళం () బృందాలు సహాయక, రక్షణ చర్యలను ముమ్మరం చేశాయని వెల్లడించారు. నష్టాన్ని అంచనా వేసేందుకు కేంద్ర బృందాలను కూడా పంపించనున్నట్లు తెలిపారు.










