కడప జిల్లా బద్వేల్ సమీపంలో జాతీయ రహదారి 67పై అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మడకలవారిపల్లె హైవేపై బండల లోడుతో వెళుతున్న ట్రాక్టర్లను వెనుక నుండి వేగంగా వచ్చిన లారీ ఢీకొట్టడంతో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి.
జాతీయ రహదారి 67పై మడకలవారిపల్లె వద్ద అర్ధరాత్రి దాటిన తర్వాత ఈ దుర్ఘటన జరిగింది. నెల్లూరు వైపు వెళుతున్న బండల లోడుతో ఉన్న ట్రాక్టర్లను వెనుక నుండి వచ్చిన లారీ బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ట్రాక్టర్ డ్రైవర్ పట్నం భాస్కర్ (40)తో పాటు, చౌడూరు గ్రామానికి చెందిన పట్నం కొండన్న (50), తలసారి రమణయ్య (50)లకు తీవ్ర గాయాలయ్యాయి.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
లారీ డ్రైవర్‌కు కూడా గాయాలు












