ప్రొద్దుటూరు నుంచి బండరాళ్లు తరలిస్తున్న ట్రాక్టర్‌ను లారీ ఢీకొన్న ఘటనలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘోర రోడ్డు ప్రమాదం బుధవారం అర్ధరాత్రి సుమారు 12 గంటల సమయంలో కడప జిల్లా బద్వేల్ సమీపంలో చోటు చేసుకుంది.
బుధవారం అర్ధరాత్రి సుమారు 12 గంటల సమయంలో బైపాస్ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ప్రొద్దుటూరు నుంచి బద్వేల్ పరిసర ప్రాంతాలకు బండరాళ్లు సరఫరా చేస్తూ వెళ్తున్న ట్రాక్టర్‌ను లారీ ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో ట్రాక్టర్లో ఉన్న భాస్కర్ (50), రమణయ్య (60) అక్కడికక్కడే మృతి చెందారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదానికి గురైన ట్రాక్టర్‌ను బద్వేల్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు, ప్రమాదానికి గల కారణాలపై సమగ్ర దర్యాప్తు చేస్తున్నారు. లారీ డ్రైవర్ పరారీలో ఉన్నట్లు సమాచారం.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి











