జిల్లాలోని హార్సిలీహిల్స్ ఘాట్ రోడ్డులో గురువారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఏపీ టూరిజం ఉద్యోగికి తీవ్ర గాయాలయ్యాయి. పైనుంచి వస్తున్న కారు బైకును ఢీకొనడంతో ఆయన కాలు విరిగింది.
వివరాల్లోకి వెళితే, తిరుపతి కొర్లగుంటకు చెందిన చెన్నారెడ్డి కుమారుడు, హార్సిలీహిల్స్పైన ఏపీ టూరిజంలో పనిచేస్తున్న సి. ప్రభాకర్ రెడ్డి (55) తన బైకుపై కొండపైకి వెళ్తున్నారు. ఈ సమయంలో ఎదురుగా పైనుంచి వేగంగా వస్తున్న కారు అదుపుతప్పి ఆయన బైకును బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ప్రభాకర్ రెడ్డి కాలు విరిగింది. ప్రమాదం జరిగిన వెంటనే, కారులో ఉన్నవారు క్షతగాత్రుడిని అదే కారులో మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే, ప్రమాదానికి కారణమైన కారు మదనపల్లె సబ్ కలెక్టరేట్ సిబ్బందికి చెందినదని బాధితుడు ప్రభాకర్ రెడ్డి చెబుతున్నారు. కానీ, కారులో ఉన్న సిబ్బంది మాత్రం రోడ్డుపై పడి ఉన్న ప్రభాకర్ రెడ్డిని తామే చూసి ఆసుపత్రికి తరలించామని, తాము ప్రమాదానికి కారణం కాదని వాదిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి











