ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ సెజ్‌లో ఉన్న అరబిందో ఫార్మా ప్లాంటులో పెన్సిలిన్-జీ వార్షిక ఉత్పత్తిని 10,000 మెట్రిక్ టన్నులకు పెంచేందుకు కంపెనీ ప్రణాళికలు రచిస్తోంది. ఈ విస్తరణ పనులు అంచనాల ప్రకారం జరుగుతున్నాయని, రాబోయే రోజుల్లో లాభదాయకతను పెంచడానికి ఇది దోహదపడుతుందని కంపెనీ ముఖ్య ఆర్థిక అధికారి (సీఎఫ్) ఎస్. సుబ్రమణియన్ తెలిపారు.
రాబోయే 12 నెలల్లో వార్షిక ప్రాతిపదికన 10,000 మెట్రిక్ టన్నుల కంటే ఎక్కువ ఉత్పత్తిని ఇక్కడ ఆశిస్తున్నామని సుబ్రమణియన్ అనలిస్ట్ కాల్ సందర్భంగా వెల్లడించారు. ఈ ప్లాంట్ పూర్తిస్థాయి సామర్థ్యం 15,000 టన్నులు. పెన్-జీ, 6ఏపీఏ, అమోక్సిసిలిన్ వంటి వాటి కనీస దిగుమతి ధర విషయంలో ప్రభుత్వం ఏడాది మినహాయింపు ఇవ్వడం మంచి నిర్ణయమని కంపెనీ అభిప్రాయపడింది.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ప్రభుత్వం ఇచ్చిన ఈ మినహాయింపు కంపెనీపై సానుకూల ప్రభావాన్ని చూపుతుందని, యాంటీబయాటిక్స్‌లో దేశం స్వయం సమృద్ధి సాధించడానికి, సరఫరాలో అంతరాయాల ముప్పు తగ్గించడానికి ప్రభుత్వ నిర్ణయం దోహదపడుతుందని సుబ్రమణియన్ పేర్కొన్నారు. ఇది ఏపీఐ (యాక్టివ్ ఫార్మా ఇన్డియెంట్), కేఎస్ఎం (ప్రాథమిక ముడిసరకు) దేశీయ తయారీని పెంచుతుందని ఆయన తెలిపారు.











