జమ్మలమడుగు, జూన్ 29
జూలై 3న రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా జమ్మలమడుగు మండలం సున్నపురాళ్ల వద్ద ఉక్కు పరిశ్రమ నిర్మాణ పనులను ప్రారంభించనున్న నేపథ్యంలో, అందుకు సంబంధించిన ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి, జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్, ప్రభుత్వ విప్ ఆదినారాయణ రెడ్డితో కలిసి సోమవారం పరిశీలించారు. ముఖ్యమంత్రి కన్యతీర్థం దేవాలయాన్ని కూడా సందర్శించనున్నారు.
జూలై 3న రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా రాయలసీమ ప్రజల కల నెరవేర్చే దిశగా.. జిల్లాలో జమ్మలమడుగు మండలం సున్నపురాళ్ల వద్ద ఉక్కు పరిశ్రమ నిర్మాణ పనుల ప్రారంభానికి జరుగుతున్న ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి, ప్రభుత్వ విప్ మరియు జమ్మలమడుగు శాసనసభ్యులు ఆదినారాయణ రెడ్డి తో కలిసి జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్, స్టీల్ ప్లాంట్ ప్రతినిధులతో కలిసి సోమవారం పరిశీలించారు.
జమ్మలమడుగు నియోజక వర్గ పరిధిలోని సున్నపురాళ్ళ పల్లె వద్ద జేఎస్ డబ్ల్యూ గ్రూప్స్ ఆధ్వర్యంలో ఉక్కు కర్మాగారం నిర్మాణ పనులకు ప్రారంభోత్సవం చేయనున్న ప్రాంతాన్ని, హెలిపాడ్, బహిరంగ సభ వద్ద జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించారు. ముఖ్యమంత్రి సందర్శించనున్న కన్య తీర్థం దేవాలయం వద్ద కూడా ఏర్పాట్లను పరిశీలించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, జమ్మలమడుగు నియోజకవర్గం సున్నపురాళ్ల పల్లెలో ఈ ప్రాంతవాసుల కలను సాకారం చేసే దిశగా అతి త్వరలోనే ఉక్కు కర్మాగార నిర్మాణం తొలిదశ నిర్మాణ పనులకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టనుందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ఉక్కు పరిశ్రమ నిర్మాణ పనులకు ప్రారంభోత్సవం చేసే దిశగా పగడ్బందీగా ఏర్పాట్లను చేయాలని సూచించారు.











