ఈ దీపావళి పండుగ సందర్భంగా జావా, యెజ్డీ లేదా మోటార్‌సైకిల్ కొనాలని కలలు కంటున్న వారికి క్లాసిక్ లెజెండ్స్ సంస్థ ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది. ఈ బైక్‌లను టెస్ట్ రైడ్ చేయడం ద్వారా తమ కలల మోటార్‌సైకిల్‌ను గెలుచుకునే అవకాశాన్ని కూడా కల్పిస్తోంది. టెస్ట్ రైడ్ అండ్ విన్ యువర్ డ్రీమ్ బైక్ పేరుతో ఈ ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించింది.
దీంతో పాటు, బైక్ కొనుగోలును సులభతరం చేసేందుకు ఆకర్షణీయమైన ఫైనాన్స్ సదుపాయాలను అందిస్తోంది. ఈ పండుగ సీజన్లో కస్టమర్ల కోసం సంస్థ ప్రకటించిన ప్రత్యేక ఆఫర్లలో భాగంగా, ప్రతి లక్ష రూపాయలకు నెలకు రూ.1,888 నుంచి ప్రారంభం కానుంది. వడ్డీ రేట్లు 4.75 శాతం నుంచి ప్రారంభమవుతాయి. డౌన్ పేమెంట్ రూ.4,999 నుంచి అందుబాటులో ఉంటుంది.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ఆకర్షణీయమైన ఫైనాన్స్ ఆఫర్లు
ఈ ఫైనాన్స్ సదుపాయాలు కస్టమర్లకు బైక్ కొనుగోలు విషయంలో మరింత వెసులుబాటు కల్పిస్తాయని సంస్థ తెలిపింది. అయితే, వర్తించే నిబంధనలు, అర్హతలు, ఫైనాన్స్ సంస్థల అనుమతిపై ఈ ఆఫర్లు ఆధారపడి ఉంటాయి.





