ప్రపంచ వ్యాక్సిన్ తయారీ కేంద్రంగా గుర్తింపు పొందిన హైదరాబాద్‌ను జీవవైజ్ఞానిక రంగంలోనూ ప్రపంచ రాజధానిగా ఎదగడానికి సహకరించాలని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు ప్రపంచ జీవవిజ్ఞాన దిగ్గజాలకు, శాస్త్రవేత్తలకు, నిపుణులకు పిలుపునిచ్చారు. హైదరాబాద్ హైటెక్స్‌లో ప్రతిష్ఠాత్మకమైన 23వ బయో ఏషియా (BioAsia 2026) అంతర్జాతీయ సదస్సును ఆయన ప్రారంభించారు.
‘టెక్బయో అన్లీష్డ్ - ఏఐ, ఆటోమేషన్, జీవశాస్త్ర రంగంలో వస్తున్న విప్లవాత్మక పరిణామాలు’ అనే ఇతివృత్తంతో నిర్వహిస్తున్న ఈ సదస్సులో ముఖ్యమంత్రి మాట్లాడుతూ, తెలంగాణ దేశంలోని ఇతర రాష్ట్రాలతో కాకుండా ప్రపంచంలోని అగ్రగామి క్లస్టర్లతో పోటీ పడుతోందని అన్నారు. ఇప్పటికే గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లకు ప్రధాన గమ్యస్థానంగా మారిన హైదరాబాద్‌ను సమగ్ర జీవవిజ్ఞాన రంగానికి ప్రపంచ కేంద్రంగా తీర్చిదిద్దడానికి అందరూ కలిసి పనిచేయాలని కోరారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
తెలంగాణలో పెట్టుబడులకు ప్రభుత్వం సంపూర్ణ మద్దతు ఉంటుందని స్పష్టం చేసిన ముఖ్యమంత్రి, “ప్రపంచ వ్యాక్సిన్ రాజధానిగా ఉన్న స్థితి నుంచి ప్రపంచ జీవవైజ్ఞానిక రాజధానిగా హైదరాబాద్ ఎదుగుతుంది. అందుకు తెలంగాణ ఉంది. తెలంగాణ అంటే వ్యాపారం. తెలంగాణ ఎదుగుతోంది. ఈ ఎదుగుదలలో భాగస్వాములు కావాలి” అని పిలుపునిచ్చారు. జీవవైజ్ఞానిక రంగంలో వస్తున్న ఆధునిక మార్పులను గమనిస్తే, పరిశోధన సంస్థలు, కార్పొరేట్లు, స్టార్టప్‌లు, చిన్న మధ్య తరహా సంస్థలు, ప్రభుత్వం మధ్య బలమైన భాగస్వామ్యం అవసరమని ఆయన పేర్కొన్నారు.











