ప్రపంచానికి భారతదేశం ఆశాకిరణంగా కొనసాగుతుందని, బలమైన ఆర్థిక వ్యవస్థతో ఆ దిశగా పయనిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. "వికసిత భారత్" లక్ష్యాన్ని సాధించడంలో వేగవంతమైన ఆర్థికాభివృద్ధి కీలకమని ఆయన పేర్కొన్నారు. బడ్జెట్ అనంతర వెబినార్‌లో ఈ వ్యాఖ్యలు చేశారు.
ప్రపంచం ప్రస్తుతం విశ్వసనీయమైన, స్థితిస్థాపకత కలిగిన తయారీ భాగస్వాముల కోసం చూస్తోందని, ఈ దిశగా భారతదేశం కీలక పాత్ర పోషించే అవకాశం ఉందని ప్రధాని మోడీ తెలిపారు. "ఎక్కువ నిర్మించు, ఎక్కువ ఉత్పత్తి చేయి, ఎక్కువ అనుసంధానం చేసుకో, ఎక్కువ ఎగుమతి చేయి" అనే ప్రభుత్వ సంకల్పం స్పష్టంగా ఉందని ఆయన అన్నారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
భారతదేశం అనేక దేశాలతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకుందని, దీని ద్వారా దేశానికి విస్తృత అవకాశాల ద్వారాలు తెరుచుకున్నాయని ప్రధాని మోడీ పేర్కొన్నారు. నాణ్యత విషయంలో ఎప్పుడూ రాజీ పడకూడదని, ఉత్పత్తులు ప్రపంచ స్థాయి ప్రమాణాలతో ఉండాలని అందరి బాధ్యత అని ఆయన అన్నారు.











