కామారెడ్డి, 2026-07-18
కామారెడ్డి మున్సిపల్ పరిధిలో కిరాణా షాపు నడుపుకుంటున్న నీల తిరుమలేష్ అనే వ్యక్తి, ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ విజయ్ కుమార్ తన మనుషులతో తన షాపుపై ఉన్న కట్టెలను తొలగించారని ఆరోపించారు. మున్సిపల్ అనుమతితో షాపు నడుపుకుంటున్న తనకు ప్రిన్సిపల్ అన్యాయం చేస్తున్నారని బాధితుడు వాపోయారు.
ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ విజయ్ కుమార్ తన మనుషులతో తన కిరాణా షాపుపై ఉన్న కవర్స్ కట్టెలను తొలగించారని నీల తిరుమలేష్ ఆవేదన వ్యక్తం చేశారు.
కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని 15వ వార్డులో, ఎస్టీ ఉమెన్స్ హాస్టల్ మరియు ఇంటర్ గ్రేట్ హాస్టల్ మధ్యలో చిన్న కిరాణా షాపు పెట్టుకొని జీవనం సాగిస్తున్నానని, ఎల్లంపేట నుండి వచ్చి కామారెడ్డి మున్సిపల్ పర్మిషన్ తీసుకొని ఈ షాపును నడుపుకుంటున్నానని తెలిపారు.
అయితే, ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ విజయ్ కుమార్ తనకు అన్యాయం చేస్తున్నారని, మున్సిపల్ స్థలంలో కిరాణా షాపు పెట్టుకోవచ్చని మున్సిపల్ అధికారులు అనుమతి పత్రం ఇచ్చినా, ప్రిన్సిపల్ తమను ఇబ్బందులకు గురి చేస్తున్నారని బాధితుడు వాపోయారు. తనకు భార్య, ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారని, దయచేసి న్యాయం చేయాలని అధికారులను వేడుకున్నారు.
ఈ కిరాణా షాపు పెట్టుకోవడానికి దాదాపు 20 వేల రూపాయలు ఖర్చు చేశానని, తనకు, తన కుటుంబానికి న్యాయం చేయాలని అధికారులను కోరారు.










