దేశంలో పెట్రోల్ ధరలు స్థిరంగా ఉంటాయని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేంద్ర ప్రభుత్వ వర్గాలు గురువారం స్పష్టం చేశాయి. రష్యా నుంచి క్రూడాయిల్ దిగుమతి, అంతర్జాతీయ ముడి చమురు ధరల పరిస్థితిని సమీక్షించిన అనంతరం ఈ ప్రకటన వెలువడింది.
రష్యా నుంచి క్రూడాయిల్ కొనుగోలు ప్రక్రియ సజావుగా సాగుతోందని, అంతర్జాతీయంగా ముడి చమురు పరిస్థితి అదుపులోనే ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ నేపథ్యంలో, దేశీయ మార్కెట్లలో పెట్రోలియం ఉత్పత్తుల ధరలు స్థిరంగా ఉంటాయని, స్వల్పకాలంలో ఎటువంటి పెరుగుదల ఉండదని వివరించాయి.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ప్రపంచవ్యాప్తంగా ఇంధన సరఫరా గొలుసులో ఏర్పడే అవాంతరాలను ఎదుర్కోవడానికి ప్రభుత్వం సన్నద్ధంగా ఉందని కేంద్ర వర్గాలు తెలిపాయి. ముఖ్యంగా, హార్ముజ్ జలసంధి మార్గంలో గ్యాస్, ఆయిల్ సరఫరాలకు ఏదైనా అంతరాయం ఏర్పడినా, దానిని ఎదుర్కోవడానికి తగినంత మేర రిజర్వులు అందుబాటులో ఉన్నాయని వెల్లడించాయి.











