కడప నగరపాలక సంస్థ కార్యాలయం ఎదుట ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ (సీఐటీయూ) ఆధ్వర్యంలో కార్మికులు పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. విధి నిర్వహణలో మరణించిన, రిటైర్డ్ అయిన కార్మికుల కుటుంబాలకు న్యాయం చేయాలని, వారి కుటుంబాల్లో ఒకరికి ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేశారు.
నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద జరిగిన ఈ ఆందోళనలో సీఐటీయూ నగర అధ్యక్షుడు సుంకర రవి మాట్లాడుతూ, 20-30 ఏళ్లుగా నగర ప్రజలకు సేవలందించి, దుమ్ము, ధూళి, వ్యర్థాల మధ్య పనిచేస్తూ అనారోగ్యంతో మరణించిన కార్మికుల కుటుంబాలను నాలుగేళ్లుగా పాలకులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ఆమరణ నిరాహార దీక్షల సమయంలో కలెక్టర్, ఎమ్మెల్యేలు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని, వెంటనే మృతుల కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. లేనిపక్షంలో భారీ పాదయాత్ర, రిలే దీక్షలు, రౌండ్ టేబుల్ సమావేశాలతో సమ్మెకు దిగుతామని హెచ్చరించారు.












