జిల్లా కేంద్రంలోని రేణుక ఎల్లమ్మ కాలనీలో సుమారు 20 ఏళ్లుగా గుడిసెలు వేసుకుని నివాసం ఉంటున్న నిరుపేదలు, తమకు ఇళ్ల పట్టాలు మంజూరు చేయాలని కోరుతూ సోమవారం ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. తమకు కనీసం సెంటు స్థలం కూడా కేటాయించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
కామారెడ్డి కామారెడ్డి జిల్లా కేంద్రంలోని రెండో వార్డు పరిధిలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల వెనుక ఉన్న రేణుక ఎల్లమ్మ కాలనీలో సుమారు 20 ఏళ్లుగా గుడిసెలు వేసుకుని నివాసం ఉంటున్న నిరుపేదలు, తమకు ఇళ్ల పట్టాలు మంజూరు చేయాలని కోరుతూ సోమవారం ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఏళ్ల తరబడి ప్రభుత్వ స్థలంలో నివాసం ఉంటూ కూలీ పనులు చేసుకుంటూ జీవిస్తున్న తమకు ఇళ్ల స్థలాల పట్టాలు ఇవ్వాలని కోరారు. నిరుపేదలకు కనీసం సెంటు స్థలం కూడా కేటాయించకుండా, మరోవైపు ప్రభుత్వ భూములు అన్యాక్రాంతమవుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.












