భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బ్యూరో, భద్రాచలం, అక్టోబర్ 19: భద్రాచలం పట్టణంలో వృద్ధులు, అనాథలు, దివ్యాంగుల సేవే లక్ష్యంగా నిర్మిస్తున్న ఆశ్రమాన్ని ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు ప్రారంభించారు. ఆధ్వర్యంలో ఈ సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయి.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బ్యూరో, భద్రాచలం, అక్టోబర్ 19: భద్రాచలం పట్టణంలోని కొత్త ఎల్పీఎస్ కార్యాలయం ఎదురుగా, కర్ర డిపో వద్ద వృద్ధులు, అనాథలు, దివ్యాంగుల సేవే లక్ష్యంగా నిర్మిస్తున్న ఆశ్రమం ప్రారంభోత్సవ కార్యక్రమంలో భద్రాచలం నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ తెల్లం వెంకట్రావు పాల్గొన్నారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ఈ సందర్భంగా (రిజిస్ట్రేషన్ నంబర్ 7/2024) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలను ఎమ్మెల్యే అభినందించారు. సమాజంలో ఆదరణకు నోచుకోని వృద్ధులు, అనాథలు, దివ్యాంగులకు ఆశ్రయం కల్పించడం గొప్ప సేవా కార్యక్రమమని ఆయన పేర్కొన్నారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు మరింత విస్తరించి, అవసరమైన వారికి అండగా నిలవాలని ఆకాంక్షించారు.












