మణుగూరు ఏరియాలోని సింగరేణి సెక్యూరిటీ విభాగానికి అనుబంధంగా పనిచేస్తున్న విశ్వాస్ సెక్యూరిటీ ఫోర్స్ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు శనివారం ఘనంగా జరిగాయి. 15 మందితో ప్రారంభమైన ఈ సంస్థ నేడు 170 మందికి ఉపాధి కల్పిస్తూ గర్వకారణంగా నిలుస్తోంది. ఈ సందర్భంగా అధికారులు, సిబ్బంది కేక్ కట్ చేసి, మిఠాయిలు పంచుకున్నారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బ్యూరో, మణుగూరు, అక్టోబర్ 31: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బ్యూరో, మణుగూరు, అక్టోబర్ 31: మణుగూరు ఏరియాలోని సింగరేణి సెక్యూరిటీ విభాగానికి అనుబంధంగా పనిచేస్తున్న విశ్వాస్ సెక్యూరిటీ ఫోర్స్ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు శనివారం సెక్యూరిటీ కార్యాలయం వద్ద ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు, పర్మినెంట్ సెక్యూరిటీ గార్డులు, సూపర్వైజర్లు, ప్రైవేట్ సెక్యూరిటీ గార్డులు కలిసి కేక్ కట్ చేసి, మిఠాయిలు పంపిణీ చేసుకుంటూ పరస్పరం శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
2003లో అప్పటి జీఎం, మాజీ డైరెక్టర్ (ఆపరేషన్స్) జె.వి. దత్తాత్రేయుల ప్రోత్సాహంతో, పర్సనల్ మేనేజర్ వి.ఎస్.ఆర్. మూర్తి సహకారంతో వ్యవస్థాపకులు ఎస్.డి. నాసర్ పాషా, జట్టి నాగమల్లేశ్వరరావుల ఆలోచనల మేరకు విశ్వాస్ యూత్ వెల్ఫేర్ సొసైటీగా ఈ సంస్థ ప్రారంభమైంది.











