కంధమాల్ (డాక్సిన్ టైమ్స్) సెప్టెంబర్ 15
ఒడిశా నుంచి మహారాష్ట్రకు అక్రమంగా గంజాయిని రవాణా చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠాపై కామారెడ్డి పోలీసులు పీడీ యాక్ట్ కింద నిర్బంధ ఉత్తర్వులు జారీ చేశారు. వీరి వద్ద నుంచి రూ.1.93 కోట్ల విలువైన 387.128 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
రూ.1.93 కోట్ల విలువైన 387.128 కిలోల గంజాయిని అక్రమంగా రవాణా చేసిన ఇద్దరు అంతర్రాష్ట్ర నిందితులపై కామారెడ్డి పోలీసులు పీడీ యాక్ట్ కింద నిర్బంధ ఉత్తర్వులు జారీ చేశారు. ఒడిశా నుంచి మహారాష్ట్రకు గంజాయిని తరలిస్తున్న ముఠాపై పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు.
ఒడిశా సరిహద్దు ప్రాంతాల నుంచి నాసిక్‌కు భారీగా గంజాయి తరలిస్తున్నట్లు దేవునిపల్లి పోలీసులకు సమాచారం అందింది. ఎస్పీ ఎం. రాజేష్ చంద్ర, ఐపీఎస్ ఆదేశాల మేరకు ప్రత్యేక బృందాలు జాతీయ రహదారి-44పై తనిఖీలు చేపట్టాయి. క్యాసంపల్లి శివారులోని రాయల్ ధాబా సమీపంలో అనుమానాస్పదంగా కనిపించిన అశోక్ లేలాండ్ బడా దోస్త్ వాహనాన్ని తనిఖీ చేయగా, పైభాగంలో పనసపండ్లు ఉంచి, వాటి కింద సంచుల్లో గంజాయిని దాచి తరలిస్తున్నట్లు గుర్తించారు. వాహనం నుంచి 387.128 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ రూ.1,93,56,400గా పోలీసులు తెలిపారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి





