జిల్లా సదాశివనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో డబ్బులు పణంగా పెట్టి పేకాట ఆడుతున్న వారిపై పోలీసులు దాడి నిర్వహించారు. విశ్వసనీయ సమాచారం మేరకు ఎస్సై పుష్పరాజు ఆధ్వర్యంలో సంతోష్ రెడ్డి పౌల్ట్రీ ఫామ్‌పై ఈ దాడి జరిగింది. ఈ ఘటనలో నలుగురిని అదుపులోకి తీసుకున్నారు.
జిల్లా సదాశివనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో డబ్బులు పణంగా పెట్టి పేకాట ఆడుతున్న వారిపై పోలీసులు దాడి నిర్వహించారు. విశ్వసనీయ సమాచారం మేరకు సదాశివనగర్ ఎస్సై పుష్పరాజు ఆధ్వర్యంలో, పోలీస్ సిబ్బందితో కలిసి సంతోష్ రెడ్డి పౌల్ట్రీ ఫామ్‌పై దాడి చేశారు. పేకాట ఆడుతున్న నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకుని, వారి వద్ద నుంచి రూ.2,080 నగదు, 4 మొబైల్ ఫోన్లు, 4 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ సందర్భంగా సదాశివనగర్ ఎస్సై పుష్పరాజ్ మాట్లాడుతూ, జూదం చట్టరీత్యా నేరమని, ప్రజలు జూదానికి దూరంగా ఉండాలని సూచించారు. మీ పిల్లల బంగారు భవిష్యత్తుపై దృష్టి పెట్టండి. సమయం చాలా విలువైనది. జూదానికి సమయాన్ని కేటాయించకుండా, మీ పిల్లల భవిష్యత్తుకు పునాది వేయడానికి మీ సమయాన్ని కేటాయించండి అని తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లోనూ జూదానికి తావు లేదని, జూదానికి పాల్పడే వారిపై కఠిన చర్యలు తప్పవని ఎస్సై పుష్పరాజు హెచ్చరించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి











