కామారెడ్డి, జూలై 20
రడడజబీరూరడోడర,సవస7చరవైషణవహచేసేదచేసటరపోీసఛేదచర.టబవభేద,పోషణభరేరణోఈదరణపపడటవచరణోేద.దడచేశచేపరచేస,శసరీదరపోదపోీసచర.
కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండలంలో మానవత్వానికే మచ్చ తెచ్చే దారుణం వెలుగుచూసింది. ఏడు నెలల చిన్నారి వైష్ణవిని హత్య చేసేందుకు కన్నతండ్రి టేకు సతీష్, సవతి తల్లి సంకు శైలజ కలిసి కుట్ర పన్నిన కేసును బీర్కూర్ పోలీసులు శాస్త్రీయ దర్యాప్తుతో ఛేదించారు. కుటుంబ విభేదాలు, చిన్నారిని పోషించడం భారమనే భావనతో ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు.
జూలై 14 అర్ధరాత్రి చిన్నారిని ఇంటి బయట నుంచి తీసుకెళ్లి సీసీ రోడ్డుపై ఈడ్చుకుంటూ వెళ్లి, బ్లేడ్లతో గాయపరిచి గడ్డి మధ్య వదిలేశారు. అనంతరం కుక్కలు ఎత్తుకెళ్లి గాయపరిచాయని గ్రామస్తులు, పోలీసులను నమ్మించే ప్రయత్నం చేశారు. చిన్నారి తల్లి సంధ్య ఫిర్యాదు మేరకు జిల్లా ఎస్పీ ఎం. రాజేష్ చంద్ర, ఐపీఎస్ ఆదేశాలతో ప్రత్యేక బృందం దర్యాప్తు చేపట్టింది.
బాన్సువాడ డీఎస్పీ విఠల్‌రెడ్డి పర్యవేక్షణలో రూరల్ సీఐ తిరుపయ్య, బీర్కూర్ ఎస్ఐ రాములు, పిట్లం ఎస్ఐ ఆంజనేయులు సాంకేతిక ఆధారాలు, సాక్షుల వాంగ్మూలాలతో అసలు కుట్రను వెలికితీశారు. నిందితులు నేరాన్ని ఒప్పుకోవడంతో ఇద్దరినీ అరెస్ట్ చేసి, వారి వద్ద నుంచి రెండు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. కేసును వేగంగా ఛేదించిన పోలీసు బృందాన్ని జిల్లా ఎస్పీ అభినందించారు.












