కామారెడ్డి, 2026-07-19
సినిమా 'దృశ్యం' తరహాలో పోలీసులను మోసం చేయాలని ప్రయత్నించిన నిందితురాలిని భిక్నూర్ పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. సీసీ కెమెరాల ఫుటేజ్, సాంకేతిక ఆధారాలను విశ్లేషించి రెండు రోజుల్లోనే ఇంటి దొంగతనం కేసును ఛేదించారు.
సినిమా 'దృశ్యం' తరహాలో పోలీసులను మభ్యపెట్టే ప్రయత్నం చేసిన నిందితురాలి అసలు పాత్రను భిక్నూర్ పోలీసులు శాస్త్రీయ దర్యాప్తుతో బట్టబయలు చేశారు. సీసీ కెమెరాల దృశ్యాలు, సాంకేతిక ఆధారాలను విశ్లేషించి కేవలం రెండు రోజుల్లోనే ఇంటి దొంగతనం కేసును ఛేదించారు.
చోరీకి గురైన ఆస్తిని పూర్తిగా స్వాధీనం చేసుకుని నిందితురాలిని అదుపులోకి తీసుకున్నారు. వేగవంతమైన దర్యాప్తు, నేర నిర్ధారణలో ప్రతిభ కనబరిచిన భిక్నూర్ పోలీస్ బృందాన్ని జిల్లా ఎస్పీ ఎం. రాజేష్ చంద్ర, ఐపీఎస్ అభినందించి ప్రశంసించారు.
నేరాల నియంత్రణలో సాంకేతికతను సమర్థంగా వినియోగిస్తూ ప్రజలకు న్యాయం అందిస్తామని పోలీసులు తెలిపారు.











