ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, మాజీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియాతో సహా మొత్తం 23 మందికి ఢిల్లీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది.
ఇటీవల నిందితులకు రౌస్ ఎవెన్యూ కోర్టు ఇచ్చిన క్లీన్ చిట్‌ను సీబీఐ ఢిల్లీ హైకోర్టులో సవాలు చేసింది. ఈ పిటిషన్‌పై సోమవారం నాడు ఢిల్లీ హైకోర్టు విచారణ జరిపింది. దర్యాప్తు సంస్థపై ప్రత్యేక కోర్టు చేసిన వ్యాఖ్యలపై ఢిల్లీ హైకోర్టు స్టే విధించింది.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ఈడీ కేసు విచారణ వాయిదా వేయాలని ట్రయల్ కోర్టుకు సూచిస్తూ, తదుపరి విచారణను వారం రోజులు వాయిదా వేసింది. ఈ పరిణామం లిక్కర్ స్కామ్ కేసులో దర్యాప్తును మరింత ముమ్మరం చేసే అవకాశం ఉంది.











