ఐపీఎల్ బెట్టింగ్ కేసులో భాగంగా, క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీకి మద్రాసు హైకోర్టు రూ. 10 లక్షల జరిమానా విధించింది. ఒక సీడీని లిఖిత ప్రతిగా మార్చే ఖర్చుల నిమిత్తం ఈ మొత్తాన్ని చెల్లించాలని కోర్టు ఆదేశించింది.
రిటైర్డ్ ఐపీఎస్ అధికారి సంపత్ కుమార్ పై ధోనీ దాఖలు చేసిన సివిల్ కేసులో మద్రాసు హైకోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది. ఈ మొత్తం మార్చి 12 లోగా చెల్లించాలని స్పష్టం చేసింది.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ఐపీఎల్ బెట్టింగ్ కుంభకోణంలో విచారణ చేపట్టిన హైకోర్టు, ఈ కేసులో భాగంగా నియమించిన కమిటీ సభ్యుడైన సంపత్ కుమార్ పై ధోనీ పరువు నష్టం దావా వేశారు. ఈ దావాలో భాగంగా ఒక సీడీని లిఖిత ప్రతిగా మార్చే ప్రక్రియకు అయ్యే ఖర్చులను ధోనీ భరించాలని కోర్టు నిర్దేశించింది.











