మండల కేంద్రంలోని కార్తికేయ నగర్ లో నూతనంగా నిర్మించనున్న శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానం, ప్రహరీ గోడ నిర్మాణ పనులకు బుధవారం ఘనంగా భూమి పూజ జరిగింది. ఈ ఆలయ నిర్మాణానికి రూ.38 లక్షల నిధులు మంజూరయ్యాయి.
కార్తికేయ నగర్ లో నూతనంగా నిర్మించనున్న శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానం, ప్రహరీ గోడ నిర్మాణ పనులకు బుధవారం ఘనంగా భూమి పూజ జరిగింది.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన నియోజకవర్గ ఇన్చార్జి శ్రీ చమర్తి జగన్ మోహన్ రాజును కార్తికేయ నగర్ ప్రముఖులు, మండల నాయకులు ఎదురేగి ఘన స్వాగతం పలికారు. అనంతరం వేద పండితుల మంత్రోచ్ఛారణల నడుమ ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించి, ఆలయ పనులకు శంకుస్థాపన చేశారు.












