రాజంపేట పట్టణం ఈడిగ పాలెం లోని శ్రీ వరసిద్ధి వినాయక స్వామి, శ్రీ బాల సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయంలో గురువారం సాయంత్రం సంకష్టహర చతుర్థి పూజను ఘనంగా నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని, తమ స్వహస్తాలతో శ్రీ మహాగణపతికి పంచామృతాభిషేకంతో పాటు సంకష్టహర చతుర్థి పూజలు నిర్వహించారు. ఆలయ వ్యవస్థాపకులు మలిశెట్టి చంద్రమౌళి ఈ వివరాలను తెలిపారు.
సంకష్టహర చతుర్థి పూజలో పాల్గొనడం వల్ల శ్రీ మహాగణపతి కృపాకటాక్షాలు లభిస్తాయని పురాణాలు చెబుతున్నాయని ఆలయ వ్యవస్థాపకులు మలిశెట్టి చంద్రమౌళి తెలిపారు. ప్రతి నెలా ఆలయంలో జరిగే సంకష్టహర చతుర్థి వ్రతంలో పాల్గొనేందుకు ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదని ఆయన తెలిపారు. భక్తులు తమ సౌకర్యాన్ని బట్టి వివిధ రకాల పత్రాలు, పూలు, కొబ్బరికాయలు, పాలు, పెరుగు, తేనె, చక్కెర, నెయ్యి, పండ్లు వంటి పూజా సామగ్రితో పాటు స్వామివారికి అన్నప్రసాదం, కుడుములతో పూజలో పాల్గొన్నారు. సంకష్టహర చతుర్థి వ్రతంలో పాల్గొనడం వల్ల సకల శుభాలు కలుగుతాయని ఇతిహాసాలు చెబుతున్నందున, ఈ పూజల్లో శ్రీ మహాగణపతికి పంచామృతాభిషేకంతో పాటు ద్వార పూజ, పీఠ పూజ, ఆధార శక్తి పూజ, అష్టాదళ పూజ, దుర్వాయుగ్మ పూజ, భాద్రపద మాస సంకష్టహర చతుర్థి వ్రత పూజా కథను భక్తులకు వినిపించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
సంకష్టహర చతుర్థి పూజలో పాల్గొన్న భక్తులకు సాయంత్రం ముప్పాల చంద్రశేఖర్ రాజు కుటుంబ సభ్యులు, చెర్లోపల్లికి చెందిన సురేష్ రాజు అన్నప్రసాదాన్ని అందజేశారు. అలాగే సంకష్టహర చతుర్థి పూజా సామగ్రిని కూడా అందజేశారు. సంకష్టహర చతుర్థి పూజలో పాల్గొనడం అత్యంత ఆధ్యాత్మిక శ్రేష్ఠమని మన పురాణాలు చెబుతున్నాయి. భక్తులు తమ కష్టాలు తీర్చుకునేందుకు సంకష్టహర చతుర్థి పూజ అత్యంత శుభప్రదమని మన ఇతిహాసాలు పేర్కొంటున్నాయి. పౌర్ణమి తర్వాత వచ్చే చతుర్థిని సంకష్టహర చతుర్థి అంటారు. ఈ వ్రతాన్ని ఆచరించిన వారికి ఆ మహాగణపతి ఆశీర్వాద బలంతో ధనప్రాప్తి, పుత్రప్రాప్తి, ఆరోగ్యం, విద్య, సకల అభీష్ట సిద్ధి కలుగుతాయని పురాణాలు చెబుతున్నాయి. ఈ వ్రతం ఆచరించినవారు అత్యున్నత పుణ్యం పొందుతారని ప్రతీతి.












