తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని 'టీచ్ ఫర్ చేంజ్' వ్యవస్థాపకురాలు మంచు లక్ష్మి, దేవేంద్ర విద్యాలయ డైరెక్టర్ విజయేందర్ గౌడ్‌తో కలిసి మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. ఈ భేటీలో రాష్ట్రంలో విద్యాభివృద్ధికి సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చ జరిగింది.
ప్రభుత్వం ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో స్థాపించనున్న సమగ్ర రెసిడెన్షియల్ పాఠశాలల ద్వారా సమానమైన, నాణ్యమైన విద్యను అందించాలనే లక్ష్యంతో 'టీచ్ ఫర్ చేంజ్' సంస్థ లక్ష్యాలను అనుసంధానించడంపై ప్రధానంగా చర్చించారు. విద్యార్థులకు మెరుగైన విద్యా అవకాశాలు కల్పించడం ఈ చర్చల ముఖ్య ఉద్దేశ్యం.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
'టీచ్ ఫర్ చేంజ్' సంస్థ అభివృద్ధి చేసిన వినూత్న విద్యా కార్యక్రమాలను 'యంగ్ ఇండియా' కార్యక్రమంలో భాగంగా ఎలా అమలు చేయవచ్చనే దానిపై కూడా ఇరువైపులా చర్చ జరిగింది. ఈ కార్యక్రమాల ద్వారా గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థులకు ప్రయోజనం చేకూర్చే అవకాశాలను పరిశీలించారు.











