ఎన్టీఆర్ జిల్లా మైలవరంలోని తారకరామానగర్ ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం అమలులో తీవ్ర నిర్లక్ష్యం చోటు చేసుకుంది. విద్యార్థులకు వడ్డించిన ఆహారం నాసిరకంగా ఉండటంతో వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, భోజనాన్ని రోడ్లపై పారబోసి నిరసన తెలిపారు. ఈ ఘటనపై ఎంఆర్పీఎస్ నాయకులు ఆందోళన చేపట్టారు.
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు పౌష్టికాహారం అందించే లక్ష్యంతో అమలు చేస్తున్న మధ్యాహ్న భోజన పథకం మైలవరంలో అభాసుపాలవుతోంది. తారకరామానగర్ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు వడ్డించిన అన్నం పాచిపోయి, ముక్కిపోయిన వాసనతో ఉందని, కూరల్లో పురుగులు కూడా కనిపించాయని విద్యార్థులు వాపోయారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
నాణ్యత లేని ఆహారాన్ని తినలేక విద్యార్థులు తీవ్ర అసహనానికి గురయ్యారు. తమ నిరసనను తెలియజేస్తూ, వడ్డించిన భోజనాన్ని పాఠశాల ఆవరణలోని రోడ్లపై పారబోశారు. గత కొంతకాలంగా భోజన నిర్వాహకులు నాణ్యత విషయంలో అశ్రద్ధ వహిస్తున్నారని, దీనివల్ల చిన్నారుల ఆరోగ్యం ప్రమాదంలో పడుతోందని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు.











