అనంతపురం, 1 July
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దార్శనికతతో దేశంలో నిర్మిస్తున్న విజ్ఞాన ఆధారిత ఆర్థిక వ్యవస్థ స్ఫూర్తితో, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 'స్వర్ణాంధ్ర - 2047' దిశగా అడుగులు వేస్తున్నారని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ తెలిపారు. అనంతపురంలోని ఏపీ సెంట్రల్ యూనివర్సిటీ తొలి స్నాతకోత్సవంలో ఆయన మాట్లాడుతూ, విద్య, ఆవిష్కరణలు, ఉపాధి అవకాశాలను సృష్టించి, భవిష్యత్తుకు సంసిద్ధమైన రాష్ట్రంగా ఏపీని తీర్చిదిద్దుతామని చెప్పారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీజీ దార్శనికతతో భారతదేశంలో విజ్ఞాన ఆధారిత ఆర్థిక వ్యవస్థ నిర్మిస్తున్నారని, అదే స్ఫూర్తితో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 'స్వర్ణాంధ్ర - 2047' దిశగా అడుగులు వేస్తున్నారని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. తద్వారా విద్య, ఆవిష్కరణలు, ఉపాధి అవకాశాలను సృష్టించి, భవిష్యత్తుకు సంసిద్ధమైన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ను తీర్చిదిద్దుతున్నామన్నారు.
అనంతపురంలోని ఏపీ సెంట్రల్ యూనివర్సిటీ తొలి స్నాతకోత్సవానికి రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపతి ముర్ము, గవర్నర్ అబ్దుల్ నజీర్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ... ఈరోజు యువ పట్టభద్రులతో నిండిన సభను చూస్తున్నప్పుడు, భవిష్యత్తును తీర్చిదిద్దడానికి సిద్ధంగా ఉన్న ఒక తరం కనిపిస్తోందన్నారు. ప్రతి తరానికీ ఒక ప్రత్యేక గుర్తింపు ఉంటుందని, భవిష్యత్తును నిర్మించే అవకాశం ఈ తరానికి లభించిందని, ఇది వారి సమయం, గొప్ప అవకాశమని అన్నారు. నేపథ్యం భవిష్యత్తును నిర్ణయించేలా ఎప్పుడూ అనుమతించకూడదని, కలలు, కఠోర శ్రమ, వ్యక్తిత్వమే వారిని నిర్వచించేలా చూసుకోవాలని సూచించారు.












