హిందీ టెలివిజన్ నటుడు అనుజ్ ఠాకూర్ (33) నిద్రలోనే మరణించారు. బంధన్ సాత్ జన్మోన్ కా, ధూమ్ మచావో ధూమ్ వంటి పలు టీవీ సీరియళ్లలో నటించి గుర్తింపు పొందిన ఆయన మృతికి సినీ, టీవీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.
హిందీ టెలివిజన్ రంగంలో తనదైన ముద్ర వేసిన నటుడు అనుజ్ ఠాకూర్ (33) అనూహ్యంగా కన్నుమూశారు. బంధన్ సాత్ జన్మోన్ కా, ధూమ్ మచావో ధూమ్, బీంద్ బనూంగా ఘోడి చఢూంగా, మహిసాగర్ వంటి పలు టీవీ సీరియళ్లలో నటించి ప్రేక్షకులను అలరించిన ఆయన, నిద్రలోనే మరణించినట్లు సమాచారం. ఆయన అకాల మరణం పట్ల టీవీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ సంతాపం తెలిపారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
నిద్రలోనే ఫిట్స్ రావడంతో మృతి
అనుజ్ మృతికి గల కారణాలను ఆయన స్నేహితుడు, కాస్టింగ్ డైరెక్టర్ రూపేష్ సోనార్ వెల్లడించారు. అనుజ్‌కు నిద్రలో మూర్ఛ (సీజర్) రావడంతోనే మరణించినట్లు ఆయన తెలిపారు. ఉదయం 4.30 గంటలకు అలారం మోగినా అనుజ్ నిద్రలేవకపోవడంతో, ఆయన తల్లి గదిలోకి వెళ్లి చూడగా అప్పటికే మరణించినట్లు గుర్తించారు. ఈ వివరాలను అనుజ్ కుటుంబ సభ్యులు తనకు తెలిపారని రూపేష్ పేర్కొన్నారు.












