ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్య నగరం పదో దీపోత్సవ వేడుకలకు సిద్ధమైంది. నగరంలోని ప్రధాన కూడళ్లు, రహదారులు, ఘాట్లను దీపాలు, విద్యుత్ దీపాలంకరణలతో అందంగా తీర్చిదిద్దుతున్నారు. ఈ సందర్భంగా రామాయణంలోని ఘట్టాలు, శ్రీరాముడు, సీతాదేవి, లక్ష్మణుడు, హనుమంతుడు తదితర పాత్రలను కళాకారులు వివిధ రూపాల్లో ప్రదర్శించనున్నారు.
ఈ ఏడాది దీపోత్సవం ఐదు రోజుల పాటు జరగనుంది. దేశంలోని వివిధ రాష్ట్రాలతో పాటు విదేశాలకు చెందిన కళాబృందాలు కూడా వేడుకల్లో పాల్గొంటాయి. దక్షిణాఫ్రికా, శ్రీలంక, నేపాల్, లావోస్, థాయ్‌లాండ్‌కు చెందిన కళాబృందాలు తమ సంప్రదాయ పద్ధతుల్లో రామలీలను ప్రదర్శించనున్నాయి. ఆయా దేశాల భాషలు, సంగీతం, నృత్యాలు, వస్త్రధారణల ద్వారా రామాయణ కథను ప్రేక్షకులకు పరిచయం చేయనున్నారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ఈసారి వేడుకల్లో సుమారు 2,500 మంది కళాకారులు 12 వేదికలపై ప్రదర్శనలు ఇవ్వనున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని 16 జిల్లాలతో పాటు ఇతర రాష్ట్రాల కళాకారులు కూడా పాల్గొంటారు. కర్ణాటకకు చెందిన డొల్లు కునిత, రాజస్థాన్ ఘూమర్, బీహార్ ఝిజియా వంటి సంప్రదాయ నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. రామాయణంలోని ఏడు కాండాలకు సంబంధించిన ఘట్టాలను శకటాల రూపంలో ప్రదర్శించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.











