తమిళ సినీ నటుడు ధనుష్ రాజకీయ రంగప్రవేశంపై మరోసారి చర్చ మొదలైంది. చెన్నైలో ఆయన తన అభిమాన సంఘానికి చెందిన మహిళా విభాగం ప్రతినిధులతో సమావేశమయ్యారు. తమిళనాడు నలుమూలల నుంచి వచ్చిన సుమారు 3 వేల మంది మహిళా సభ్యులు, నిర్వాహకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
అభిమాన సంఘాన్ని సంక్షేమ ఉద్యమంగా పునర్వ్యవస్థీకరించిన కొద్ది రోజులకే ఈ సమావేశం జరగడంతో ధనుష్ రాజకీయాల్లోకి వస్తారనే ఊహాగానాలు ఊపందుకున్నాయి. అయితే, ఆయన ఇప్పటివరకు రాజకీయ ప్రవేశంపై అధికారిక ప్రకటన చేయలేదు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
మహిళా అభిమానులతో ప్రత్యేక సమావేశం
చెన్నై శివారులోని సెమ్మంజేరిలో ఉన్న ఓ ప్రైవేటు కళాశాలలో ఆదివారం ఈ కార్యక్రమం నిర్వహించారు. వివిధ జిల్లాల నుంచి వచ్చిన మహిళా అభిమాన సంఘ ప్రతినిధులతో ధనుష్ ముచ్చటించి, వారితో ఫొటోలు దిగారు. సమావేశానికి వచ్చిన మహిళలకు దీపావళి కానుకగా వెండి కామాక్షి దీపాలను అందించారు.
ఈ కార్యక్రమంలో ధనుష్ రాజకీయాల గురించి మాట్లాడలేదని, తనను కలిసినందుకు సంతోషం వ్యక్తం చేస్తూ సభ్యులకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారని పాల్గొన్నవారు పేర్కొన్నారు. అభిమానులు చదువు, ఉద్యోగం, కుటుంబ బాధ్యతలపై దృష్టి పెట్టాలని ఆయన సూచించినట్లు తమిళ మీడియా కథనాలు తెలిపాయి.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి







