వేసవి తాపం నుంచి ఉపశమనం కోసం ఖరీదైన ఏసీలు కొనలేని సామాన్యుల కోసం ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీకి చెందిన విద్యార్థిని కల్యాణి శ్రీవాస్తవ ఓ వినూత్న ఆవిష్కరణ చేసింది. కేవలం రూ.1,800 ఖర్చుతో థర్మాకోల్ పెట్టె, మంచు సహాయంతో పనిచేసే దేశీ ఏసీని రూపొందించి అందరి మన్ననలు పొందింది. ఈ ఆవిష్కరణ తాజాగా మరోసారి వార్తల్లోకి వచ్చింది.
సాధారణంగా వేసవిలో ఉష్ణోగ్రతలు పెరిగినప్పుడు ఏసీల అవసరం పెరుగుతుంది. అయితే అధిక ధరలు, విద్యుత్ బిల్లుల భారం కారణంగా చాలామందికి ఏసీలు అందుబాటులో ఉండవు. ఈ సమస్యకు పరిష్కారంగా, 2017లో ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు కల్యాణి శ్రీవాస్తవ ఈ దేశీ ఏసీని రూపొందించింది. ఈ పరికరం అప్పట్లోనే పలువురి దృష్టిని ఆకర్షించింది.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
కల్యాణి రూపొందించిన ఈ పరికరంలో ప్రధానంగా థర్మాకోల్‌తో చేసిన పెట్టె, 12 వోల్టుల డైరెక్ట్ కరెంట్ ఫ్యాన్, గాలి బయటకు వచ్చేందుకు గొట్టం ఉంటాయి. పెట్టెలో ఉంచిన మంచు ద్వారా గాలిని చల్లబరిచి, ఫ్యాన్ సహాయంతో బయటకు పంపేలా దీన్ని తయారు చేశారు. ఈ పరికరాన్ని సుమారు గంటసేపు ఉపయోగిస్తే గది ఉష్ణోగ్రత 4 నుంచి 5 డిగ్రీల సెల్సియస్ వరకు తగ్గుతుందని అంచనా.












